నాగార్జున బ్యూటీకి ప్రపోజ్ చేసిన నెటిజన్.. ఆమె రిప్లై చూస్తే షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే..(పోస్ట్)

by Gugulothu.Kavitha |

‘మొదటి సినిమా’(Modati Cinema) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పూనమ్ బజ్వా(Poonam Bajwa) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

నాగార్జున బ్యూటీకి ప్రపోజ్ చేసిన నెటిజన్.. ఆమె రిప్లై చూస్తే షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే..(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మొదటి సినిమా’(Modati Cinema) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పూనమ్ బజ్వా(Poonam Bajwa) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతగా అవకాశాలు రాలేదు. వచ్చినవి కూడా సెకెండ్ హీరోయిన్‌ చాన్సులే. దీంతో ఇండస్ట్రీకి దూరం అయింది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేస్తుంది. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌‌(Instagarm)లో పూనమ్ తన అభిమానులతో “Ask Anything” అనే ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించింది. అందులో కొందరు ఫ్యాన్స్ ఆమె అందం, అభిరుచుల గురించి ప్రశ్నలు వేయగా, పూనమ్ వాటికి ఫన్నీగా, ఒపెన్‌గా సమాధానాలిచ్చింది. అయితే ఓ నెటిజన్ మాత్రం ఓ స్టెప్ ముందుకు వేసి.. ఈ ముద్దుగుమ్మకు “పూజా జి ఐ లవ్ యూ” అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో పూనమ్ మొదట కొద్దిగా షాక్ అయినా, వెంటనే తనదైన స్టైల్లో ఫన్నీగా స్పందించింది.”అది నువ్వు పూజాను అడగాలి.. నేనైతే లవ్ చేయను?” అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు షాక్ అయి షేక్ అవుతున్నారు.


Next Story