Netflix : మళ్ళీ క్రాష్ అయిన నెట్‌ఫ్లిక్స్‌

by Muthe.Rajitha |   (  Updated:2025-12-26 06:05:44  IST  )

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ మరోసారి క్రాష్ అయింది.

Netflix : మళ్ళీ క్రాష్ అయిన నెట్‌ఫ్లిక్స్‌
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ మరోసారి క్రాష్ అయింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు సాయంత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఒకేసారి స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ భారీ ట్రాఫిక్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు ఓవర్‌లోడ్ అయి కొద్దిసేపు క్రాష్ అయ్యాయి. చాలా మంది యూజర్లు “Something went wrong” అనే ఎర్రర్ మెసేజ్ చూసి సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం వేల సంఖ్యలో రిపోర్టులు నమోదు అయ్యాయని పేర్కొంది.

అయితే కొద్ది నిమిషాల్లోనే నెట్‌ఫ్లిక్స్ సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించింది. ఇదే సీజన్‌లో వాల్యూమ్ 1 (ఎపిసోడ్‌లు 1-4) నవంబర్ 26న విడుదలైనప్పుడు కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ 8 డిసెంబర్ 31, న్యూ ఇయర్ ఈవ్ రోజు విడుదల కానుండగా, థియేటర్లలో ప్రత్యేక స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ చివరి సీజన్‌లో హాకిన్స్ గ్యాంగ్ వెక్నాతో తుది పోరాటానికి సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

Next Story