Nenu Redy: ‘నేను రెడీ’ షూటింగ్‌లో జోరు.. ఫొటోలు వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-09-01 15:53:56  IST  )

గతేడాది ‘భైరవకోన’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలతో అలరించిన యంగ్ బ్యూటీ కావ్య థాపర్ (Kavya Thapar).. ప్రజెంట్ ‘నేను రెడీ’ (Nenu Redy) చిత్రంతో బిజీగా ఉంది.

Nenu Redy: ‘నేను రెడీ’ షూటింగ్‌లో జోరు.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: గతేడాది ‘భైరవకోన’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలతో అలరించిన యంగ్ బ్యూటీ కావ్య థాపర్ (Kavya Thapar).. ప్రజెంట్ ‘నేను రెడీ’ (Nenu Redy) చిత్రంతో బిజీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. హీరోయిన్, హీరోతో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా.. హవీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ ఫ్యామిలీ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటి గణేషన్, అజయ్, మురళి గౌడ్, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story