Neha shetty: క్లాసిక్ లుక్‌లో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్

by Pulgam srinivas |

క్లాసిక్ లుక్‌లో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్ నేహా శెట్టి

Neha shetty: క్లాసిక్ లుక్‌లో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి నేహా శెట్టి ‘మెహబూబా’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.




ఆ తర్వాత హిట్ కోసం ఈమె చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలాంటి సమయంలోనే 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ చిత్రంతో ఈమెకు మంచి విజయం దక్కింది. దాంతో ఒక్కసారిగా ఈమె పేరు తెలుగు చిత్రసీమలో మారుమోగడం మొదలైంది. ఆ తర్వాత నేహా పలు చిత్రాలలో నటించినప్పటికీ, అందులో ఏదీ ‘డీజే టిల్లు’ స్థాయి విజయాన్ని సాధించలేదు.




అయితే ఈమె నటించిన ‘బెదురులంక 2012’ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎక్కువ సినిమాలు లేకపోయినా, సినిమాల్లో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా అలరిస్తోంది.




తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె లేత గులాబీ రంగు చీరతో పాటు అందమైన ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ ధరించింది. మెడలో బంగారు హారం, చెవులకు జుమ్కాలు, నుదిటిపై టిక్కా ధరించి సంప్రదాయ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతోంది.




అదే విధంగా తన నడుముకు వడ్డానం ధరించి బ్యాక్ అందాలు కూడా హైలైట్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈమె క్లాస్ లుక్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండడంతో, ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story