Neha Sharma: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడంటున్న నెటిజన్లు!

by sudharani |
Neha Sharma: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: చిరుత సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నేహా శర్మ (Neha Sharma).. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘కుర్రాడు’ చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ.. ఈ సినిమా ప్లాప్ కావడంతో ఇక తెలుగు తెరకు గుడ్ బై చెప్పేసింది. 2017లో ‘ముబారకన్’ అనే హిందీ చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక అప్పటి నుంచి మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అంతే కాకుండా ప్రజెంట్ ఈ బ్యూటీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా (Social media)లో బిజీగా ఉంటూ ప్రేక్షకులను పలకరింస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ డెస్సుల్లో (Trendy dresses) దర్శనమిస్తూ మెస్మరైజ్ (Mesmerize) చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నేహా శర్మ మెరున్ కలర్ లెహంగా (Maroon color lehenga)లో దర్శనమిచ్చింది. క్యూట్‌గా చూస్తూ ఫొటోలుకు ఫోజులు ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో.. ‘సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడూ స్టార్ట్ చేస్తావు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed