సినిమాలు చేయకున్నా చేతినిండా సంపాదిస్తున్న నేహా శర్మ.. బోల్డ్ వీడియో వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-18 11:48:02  IST  )

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను ఆన్ చేసి, తన పర్సనల్, బోల్డ్ కంటెంట్‌ను చూడాలనుకునే వారి కోసం నెలకు రూ. 290 చొప్పున ఫీజు ఫిక్స్ చేసింది.

సినిమాలు చేయకున్నా చేతినిండా సంపాదిస్తున్న నేహా శర్మ.. బోల్డ్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: ‘కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన నేహా శర్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘చిరుత’తో గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు హిందీలోనూ కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. సరైన హిట్లు లేకపోవడంతో 2023 తర్వాత ఈ భామ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే, సినిమాలకు దూరం అయినప్పటికీ.. రూట్ మార్చి సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను ఆన్ చేసి, తన పర్సనల్, బోల్డ్ కంటెంట్‌ను చూడాలనుకునే వారి కోసం నెలకు రూ. 290 చొప్పున ఫీజు ఫిక్స్ చేసింది. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి పనులు చేస్తోందంటూ నెట్టింట ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న నేహా శర్మ.

ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఆమెకు కేవలం ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారానే నెలకు దాదాపు రూ. 45 లక్షల వరకు ఆదాయం వస్తోందని సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. తాజాగా నేహా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన బోల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వీడియోలో ఆమె మేకప్ వేసుకుంటూ, తన ఎద అందాలను కెమెరాకు బాగా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తూ విపరీతమైన గ్లామర్ షో చేసింది. ఈ బోల్డ్ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. డబ్బు, ఫేమ్ కోసమే నేహా శర్మ ఇంతలా దిగజారి ప్రవర్తిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అక్కడ టచ్ చేయడంతో ఏం చేసిందంటే?

Next Story