- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి సహకరించకపోయినా.. ఫైనల్‌గా మీ ముందుకొస్తున్న సినిమా..
తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా వస్తున్న సినిమా ‘నీలకంఠ’. శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాను నిర్మిస్తుండగా... రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్

దిశ, సినిమా : తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా వస్తున్న సినిమా ‘నీలకంఠ’. శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాను నిర్మిస్తుండగా... రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులు.. ‘నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్‌తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని ‘నీలకంఠ’ ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్‌లో ప్రకృతి సహకరించలేదు. తుఫాన్ కారణంగా షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలు దాటుకుని మా చిత్రాన్ని జనవరి 2న మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా ‘నీలకంఠ’ చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.






