- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NC-24: నాగ చైతన్యతో రొమాన్స్ చేయబోతున్న మెగా బ్యూటీ.. ఈసారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా 'తండేల్'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా 'తండేల్'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో NC-24 అనే మూవీలో నటించనున్నాడు. అయితే దీనిని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. నాగ చైతన్య సరసన ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే హీరో, హీరోయిన్స్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఈ సారి బొమ్మ బ్లాకు బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మీనాక్షి రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.






