- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NBK 111కు కొత్త చిక్కులు..తెరపైకి మూడో కథ ?
అఖండ 2 సినిమాతో అదరగొట్టిన నందమూరి బాలయ్య, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. బడ్జెట్ కారణంగా ముందుగా అనుకున్న స్టోరీని రద్దు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో రెండో స్టోరీని కూడా బాలయ్య కోసం గోపీచంద్ సిద్ధం చేశారట. కానీ రెండో కథ బాలయ్యకు నచ్చలేదని ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. దీంతో మూడో కథ సిద్ధం చేయాలని నిర్మాతలు, గోపీచంద్ కు చెప్పినట్లు టాక్.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఇటీవల అఖండ 2 సినిమాతో అదరగొట్టిన నందమూరి బాలయ్య, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 2025లో పూజా కార్యక్రమం నిర్వహించారు. అయితే ముందుగా ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తారని ప్రచారం సాగింది.
అయితే బడ్జెట్ కారణంగా ముందుగా అనుకున్న స్టోరీని రద్దు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో రెండో స్టోరీని కూడా బాలయ్య కోసం గోపీచంద్ సిద్ధం చేశారట. కానీ రెండో కథ బాలయ్యకు నచ్చలేదని ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. దీంతో మూడో కథ సిద్ధం చేయాలని నిర్మాతలు, గోపీచంద్ కు చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు బడ్జెట్ సిద్ధం కూడా చేస్తున్నారట. రెండు వారాల్లో ఈ కథ కూడా ఫైనల్ అయ్యే ఛాన్సులు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.






