- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడిలో ప్రత్యేక పూజలు..విడాకుల వార్తలకు చెక్ పెట్టిన నయనతార !
స్టార్ హీరోయిన్ నయనతార ( Nayantara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా... సినిమా

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార ( Nayantara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా... సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళ్, హిందీ ఇలా ఏ భాష అయినా సరే.. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ కావాల్సిందే. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటూ ఉంటారు. అయితే అలాంటి హీరోయిన్ నయనతార.. పర్సనల్ లైఫ్ గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తన భర్త విగ్నేష్ శివన్ కు (Vignesh Shivan) హీరోయిన్ నయనతార విడాకులు ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో.. విడాకులు అంటూ ప్రచారం చేశారు. పెళ్లి అంటే నరకం అన్న రేంజ్ లో నయనతార పోస్ట్ పెట్టి డిలీట్ చేశారట. అంతలోనే ఆ పోస్టు వైరల్ అయింది.. దింతో విడాకుల అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఆ వార్తలకు తాజాగా నయనతార చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
తన భర్త విగ్నేష్, పిల్లలతో కలిసి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యక్షమైంది నయనతార. పళని స్వామి ఆలయానికి తాజాగా నయనతార దంపతులు వెళ్లారు. ఈ సందర్భంగా... సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కనిపించారు. ఇందులో భార్యాభర్తలిద్దరూ ఎంతో క్లోజ్ గా కనిపించారు. దీంతో విడాకుల వార్తకు చెక్ పడినట్లు అయింది. సోషల్ మీడియాలో స్పందించకుండా.. గుడికి దంపతులు ఇద్దరు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని మళ్ళీ చర్చ జరుగుతుంది.
Twitter Link
పళని స్వామి వారిని దర్శించుకున్న నయనతార దంపతులు#Nayanthara #PalaniSwamy pic.twitter.com/KN0dlZLHHk
— greatandhra (@greatandhranews) July 5, 2025






