- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వివాదంలో నయనతార.. ఎందుకిలా అవుతోంది..?
ప్రస్తుతం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కొరియోగ్రాఫర్ జానీకి మద్దతుగా నిలిచారన్న

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కొరియోగ్రాఫర్ జానీకి మద్దతుగా నిలిచారన్న కారణంగా సోషల్ మీడియాలో విమర్శలపాలైన ఈ జంట, ఇప్పుడు ‘చంద్రముఖి’ సినిమాతో సంబంధం ఉన్న వివాదంలో చిక్కుకున్నారు.
నయనతార జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ‘Nayanthara: Beyond The Fairy Tale’ పై తాజాగా చంద్రముఖి నిర్మాతలు లీగల్ యాక్షన్ తీసుకున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ చిత్రం ఫుటేజీని ముందస్తు అనుమతి లేకుండా ఉపయోగించారని AP ఇంటర్నేషనల్ అనే సంస్థ ఆరోపించింది.
శివాజీ ప్రొడక్షన్స్ నుంచి ఒరిజినల్ కాపీరైట్స్ హక్కులు పొందిన AP ఇంటర్నేషనల్ ఇప్పటికే డాక్యుమెంటరీ నిర్మాతలకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతూ సీజ్ నోటీసులు జారీ చేసింది. కానీ, డాక్యుమెంటరీ టీం ఈ ఫుటీజీ హక్కులకు సంబంధించి సంప్రదింపులు ప్రారంభించినప్పటికీ, అది నోటీసులు పంపిన తర్వాత మాత్రమేనట.
ఈ నేపథ్యంలో తాజాగా మద్రాస్ హైకోర్టు నెట్‌ఫ్లిక్స్‌కు, డాక్యుమెంటరీ ప్రొడక్షన్ కంపెనీకి లీగల్ నోటీసులు జారీ చేసింది. AP ఇంటర్నేషనల్ వాదన ప్రకారం, డాక్యుమెంటరీలో యూట్యూబ్ నుంచి కాపీ చేసిన విధంగా 'చంద్రముఖి' వీడియో క్లిప్పింగ్‌లు ఉపయోగించారట.
ఇప్పుడు, ఈ సంస్థ కోర్టును ఆశ్రయించి, ‘చంద్రముఖి’ ఫుటేజీ వినియోగాన్ని నిలిపివేయాలని, ఇప్పటికే చొరబడిన వీడియో క్లిప్స్‌ను డాక్యుమెంటరీ నుంచి పూర్తిగా తొలగించాలని కోరుతోంది.
ఈ వివాదం నయనతార డాక్యుమెంటరీకి మరో మలుపు తెచ్చినట్లుగా మారింది. ఇప్పటికే విమర్శలతో ఉన్న ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు లీగల్ ఇబ్బందులు కూడ పోరుబారుతున్నాయి. ఇక దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.






