- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైకో థ్రిల్లర్ ‘నయనం’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రేక్షకులను వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్దదైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5.. మరోసారి తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ఆడియన్స్‌ను అలరించనుంది. వరుణ్ సందేశ్ ఓటీటీ డెబ్యూ ‘నయనం’ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు

దిశ, సినిమా : ప్రేక్షకులను వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్దదైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5.. మరోసారి తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ఆడియన్స్‌ను అలరించనుంది. వరుణ్ సందేశ్ ఓటీటీ డెబ్యూ ‘నయనం’ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ తాజాగా విడుదల కాగా ఆకట్టుకుంటోంది. ఆరు ఎపిసోడ్స్ కలిగిన జీ5 ఒరిజినల్.. నటుడిగా తన సరికొత్త ప్రయాణంగా మారిందన్నాడు వరుణ్ సందేశ్. ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నానని... పోస్టర్‌ను గమనిస్తే తన పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుందన్నాడు. ఓటీటీలో యాక్ట్ చేయటం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్‌ను మరింతగా ఎలివేట్ చేసినట్లయ్యిందన్న వరుణ్.. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు.






