ఆసక్తి పెంచుతున్న నయనం ట్రైలర్.. ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్

by Sujitha Rachapalli |

ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 మ‌రోసారి త‌న‌దైన శైలిలో విల‌క్ష‌ణ‌మైన తెలుగు ఒరిజిన‌ల్ సిరీస్‌ ‘నయనం’తో అల‌రించ‌నుంది. వ‌రుణ్ సందేశ్‌, ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ

ఆసక్తి పెంచుతున్న నయనం ట్రైలర్.. ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్
X

దిశ, సినిమా : ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 మ‌రోసారి త‌న‌దైన శైలిలో విల‌క్ష‌ణ‌మైన తెలుగు ఒరిజిన‌ల్ సిరీస్‌ ‘నయనం’తో అల‌రించ‌నుంది. వ‌రుణ్ సందేశ్‌, ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ ఒరిజిన‌ల్ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేయగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో వరుణ్.. ‘శేఖర్ గారు ఈ స్టోరీ గురించి చెప్పారు. స్వాతి, సాధిక‌ గారు ఇచ్చిన నెరేషన్ విన‌గానే షాక్‌లో ఉండిపోయాను. ఏం ఆలోచించ‌కుండా ఎలాగైనా న‌య‌న్ క్యారెక్టర్ చేయాల‌ని డిసైడ్ అయిపోయాను. జీ5 టీమ్ ఇలాంటి ఓ వండ‌ర్ఫుల్ ప్రాజెక్ట్‌ను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకు వ‌స్తుండ‌టం గొప్ప విష‌యం. ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రామ్‌, రజినీ గారికి థాంక్స్‌. చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ చేశాన‌నే సాటిస్పాక్ష‌న్‌తో మీ ముందుకు వ‌స్తున్నాను. డిసెంబ‌ర్ 19 ఎప్పుడొస్తుందా.. ప్రేక్ష‌కులు ‘న‌య‌నం’ను ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. అలీరెజా, ప్రియాంక‌, రేఖతోపాటు అంద‌రూ అద్భుతంగా న‌టించారు. అజ‌య్‌ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌, షోయ‌బ్ విజువ‌లైజేష‌న్‌ను స్క్రీన్‌పై చూద్దామని వెయిట్ చేస్తున్నాను’ అని తెలిపాడు.

Next Story