Nawazuddin Siddiqui: ఇండస్ట్రీపై నవాజుద్ధీన్ సిద్ధిఖి సంచలన కామెంట్స్..

by Kodari Anjali |

నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో చాలా సినిమాలు కాపీ కొట్టడం వల్ల సృజనాత్మకత లోపించిందని అన్నారు.

Nawazuddin Siddiqui: ఇండస్ట్రీపై నవాజుద్ధీన్ సిద్ధిఖి సంచలన కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో చాలా సినిమాలు కాపీ కొట్టడం వల్ల సృజనాత్మకత లోపించిందని అన్నారు. పరిశ్రమ తరచుగా దక్షిణ భారత చిత్రాల నుంచి ఆలోచనలను తీసుకుంటుందని , ప్రముఖ సినిమాల నుంచి సన్నివేశాలను కూడా కాపీ చేస్తుందని ఆయన ఎత్తి చూపారు.

హిట్స్ అయిన కొన్ని కల్ట్-ఫిల్మ్‌లు, కొన్ని జనాదరణ పొందిన చిత్రాలలో కూడా కాపీ చేసిన సన్నివేశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇది చాలా సాధారణం అయిపోయిందని తెలిపారు. కానీ వీటిని ఎవ్వరూ ప్రశ్నించరని ఆయన చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో సృజనాత్మకత లేకపోవడాన్ని నవాజుద్దీన్ సిద్ధిఖీ విమర్శించారు. పరిశ్రమ అభద్రతతో కూడుకున్నదని, ఆలోచనలను కాపీ చేసే ధోరణితో ఉందని అన్నారు.

తన కొత్త సినిమాను ప్రమోట్ చేస్తూ.. బాలీవుడ్ మరింత అభద్రతతో మారుతోందని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పుకొచ్చారు. అదే ఆలోచనలు మళ్లీ మళ్లీ వాడుతున్నారని, ఏదైనా పనిచేసినప్పుడు, ప్రజలు దానిని పునరావృతం చేస్తూనే ఉంటారని ఆయన పంచుకున్నారు. మా పరిశ్రమలో, ఐదేళ్లపాటు ఇదే పునరావృతం అవుతుందని పేర్కొన్నారు.

ఇలా చేయడం వల్ల ప్రజలకు విసుగు చెందుతుందని.. అప్పుడు వారు చివరకు దానిని వదిలేస్తారని తెలిపారు. ఇప్పుడు పార్ట్ 2, 3 4 ని కూడా చేస్తూ ఉన్నారు. ఇది సృజనాత్మక దివాలా లాంటిది. ఆర్థిక దివాలా లాంటిది కూడా అని అన్నారు. సృజనాత్మకత పెద్దగా లేకపోవడం.. ప్రారంభం నుండి, మన పరిశ్రమ కాపీ కొడుతోందని, మనం పాటలు, కథలను కాపీ కొడుతున్నామని నవాజుద్దీన్ సిద్ధిఖీ వెల్లడించారు.

Next Story