- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సినిమా పరిశ్రమలో నిజమైన స్నేహాలుంటాయని నేను నమ్మను’.. నటుడి కామెంట్స్ వైరల్
నటుడు నవాజుద్దీన్ సిద్దికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు నవాజుద్దీన్ సిద్దికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన సర్ఫారోష్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పాన్ సింగ్ తోమర్, తీన్, పేట, హీరోపంతి 2, టికు వెడ్స్ షేరు, సైంధవ్, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఈ నటుడు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా ఏ విషయాన్నైనా డైరెక్ట్‌గా వెల్లడిస్తారు. అయితే తాజాగా నటుడు నవాజుద్దీన్ సిద్దికి.. సినిమా పరిశ్రమలో నిజమైన స్నేహాలు ఉంటాయని తాను నమ్మనని స్పష్టం చేశాడు.
‘కాలక్రమేణా నేడు ఒక వ్యక్తి ఉంటాడు, రేపు మరొకరు ఉంటాడు. అది అవసరం లేదా ప్రయోజనాల ఆధారంగా ఉంటుంది. జీవితంలో నాకు ఉన్న స్నేహాలు కూడా ఇక్కడి నుంచి కాదు, పాత కాలం నుండి వచ్చినవి. పరిశ్రమలో చాలా సంబంధాలు వ్యక్తిగత లాభంపై నిర్మించినవని, విధేయత లేదా నిజమైన సంబంధంపై కాదని ఆయన నమ్ముతానని వెల్లడించాడు. ఇక్కడ ప్రతి నటుడిలో అభద్రతభావం ఉండటం వల్ల అలా జరుగుతుంది. అందువల్ల, ఒకరి పట్ల ఒకరు బలమైన స్నేహం లేదా విధేయత ఉండదు. పరిశ్రమ ఆ విధంగా బలంగా, ఐక్యంగా లేదు’ అంటూ రాసుకొచ్చారు.






