- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి కొంపముంచిన మల్లెపూలు.. లక్షలు పోగొట్టుకుందిగా..
మలయాళ నటి నవ్యా నాయర్ మెల్బోర్న్ విమానాశ్రయంలో ఎదుర్కొన్న సంఘటనను ఓ ఈవెంట్లో పంచుకుంది. మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఇబ్బందుల్లో పడ్డానని చెప్పింది. కొచ్చి నుంచి సింగపూర్ మీదుగా మెల్బోర్న్

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ నటి నవ్యా నాయర్ మెల్బోర్న్ విమానాశ్రయంలో ఎదుర్కొన్న సంఘటనను ఓ ఈవెంట్లో పంచుకుంది. మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఇబ్బందుల్లో పడ్డానని చెప్పింది. కొచ్చి నుంచి సింగపూర్ మీదుగా మెల్బోర్న్ వెళ్తున్న ఆమెకు తండ్రి రెండు మూరల మల్లెపూలు ఇచ్చాడు. ఓ మూర జడలో పెట్టుకున్న ఆమె.. మరో మూర ఓనం సెలబ్రేషన్స్ కోసం హ్యాండ్‌బ్యాగ్‌లో దాచుకుంది. రూల్స్ తెలియక దీన్ని డిక్లేర్ చేయకపోవడంతో.. గుర్తించిన విమానాశ్రయ అధికారులు ఏకంగా రూ. 1.14 లక్షల జరిమానా విధించారని.. 28 రోజుల్లో చెల్లించాలని సూచించారని తెలిపింది. తెలియక చేసిన తప్పే అయినా చట్టవిరుద్ధం కాబట్టి జరిమానా చెల్లించాల్సిందేనని చెప్పింది. చెల్లించే ముందు ఓ రీల్ కూడా షేర్ చేసింది. కాగా ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం తాజా పువ్వులు, ఆకులను డిక్లేర్ చేయాలి. తనిఖీ చేశాకే తీసుకెళ్లాలి. కారణం ఇవి ఫ్లైట్ వాతావరణాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు.






