- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవీన్ పొలిశెట్టికి ప్రమాదం..ఏడాది కాలం షూటింగ్ కు దూరం !
నవీన్ పొలిశెట్టి ( Naveen Polishetty) ఒకరు. జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన నవీన్ పొలిశెట్టి

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కుర్ర హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది హీరోలు అతి తక్కువ కాలంలో పాపులరై, ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అలాంటి హీరోలలో నవీన్ పొలిశెట్టి ( Naveen Polishetty) ఒకరు. జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన నవీన్ పొలిశెట్టి ఆ తర్వాత పెద్ద స్థాయిలో హిట్ అందుకోలేదు. కానీ తన ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడా వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే 'అనగనగా ఒక రాజు' ( Anaganaga Oka Raju ) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నవీన్ పొలిశెట్టి నటించిన ఉండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మెరుస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాకు కళ్యాణ్ శంకర్ ( Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్నారు.
జనవరి 14, 2026 సంవత్సరం అంటే సంక్రాంతి కానుక ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి నుంచే మనోడు ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ సినిమాలోని భీమవరం బల్మా ( Bhimavaram Balma Song) అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నవీన్ పొలిశెట్టి పాల్గొని సందడి చేశారు. అంతేకాదు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'అనగనగా ఒక రాజు సినిమా జరుగుతున్న క్రమంలోనే తనకు ఓ ప్రమాదం జరిగిందన్నారు నవీన్ పొలిశెట్టి. దీంతో తాను షూటింగ్ కు ఏడాది కాలం పాటు దూరమైనట్లు వెల్లడించారు. ఆ సమయంలో తన చేతితో పాటు వెన్నెముకకు తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు. ఆ ప్రమాదం జరగగానే మళ్లీ సినిమాలు చేస్తానా ? లేదా? అనే టెన్షన్ మాత్రం అప్పుడు వచ్చిందన్నారు. అయితే ప్రేక్షకుల ఆశీస్సులతో మళ్ళీ హీరోగా నటిస్తున్నట్లు గుర్తు చేసుకున్నారు. తాను నటించిన జాతి రత్నాలు, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలను జనాలు బాగా ఆదరించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఈ సినిమాను అనగనగా ఒక రాజు సినిమా కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.






