- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఈ సంతోషకరమైన మూమెంట్స్‌కు మీలో ప్రతి ఒక్కరూ కారణమే’.. ఫొటోలు పంచుకుంటూ నేచురల్ స్టార్ నాని పోస్ట్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డిస్కషన్ కోర్టు మూవీ గురించే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డిస్కషన్ కోర్టు మూవీ గురించే. ఈ మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. భారీ వసూళ్లు కొల్లగొడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. హీరో నాని నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ఈ నెల (మార్చి) 14 వ తేదీన థియేటర్లలోకి వచ్చింది.
ఈ సినిమాకు జగదీష్ దర్శకత్వం వహించారు. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ మంచి హిట్ అయ్యింది. రోషన్‌తో శ్రీదేవికి ఓ ఫోన్ కాల్ ద్వారా లవ్ పరిచయం అవ్వగా.. ఇది కాస్త ప్రేమగా మారుతుంది. తర్వాత ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ రోషన్ తక్కువ కులం వాడని శ్రీదేవి బావ శివాజీకి నచ్చదు. దీంతో హీరోయిన్‌ను రేప్ చేశాడని హీరోను పోక్సో కేసులో ఇరికిస్తాడు శివాజీ.
ఇక హీరో తరపున వాదించడానికి లాయర్లు ఎవరూ రాదు. మంగపతి డబ్బు, పలుకుబడి కారణంగా అంతా ఆయన వైపే ఉంటారు. ఇక ఆ సమయంలోనే లాయర్ ప్రియదర్శి ఎంట్రీ ఇచ్చి.. కోర్టులో చందు తరపున వాదిస్తాడు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ మూవీలో టచ్ చేశాడు. అలాగే ఈ మూవీలో లవ్ స్టోరీ మాత్రం ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా క్లీన్‌గా ఉందని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా శివాజీ ఎంట్రీ తర్వాతే కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనలతో సాగుతుంది. డైలాగ్స్ కూడా అదిరిపోయానని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ సక్సెస్ సాధించడంతో నాని సోషల్ మీడియా వేదికన సంతోషకరమైన పోస్ట్ పెట్టాడు. టీమ్ అందరితో సెల్ఫీ దిగి వాటికి ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ‘‘‘ఈ సంతోషకరమైన మూమెంట్స్‌కు మీలో ప్రతి ఒక్కరూ కారణమే’’ అంటూ జోడించారు. ప్రస్తుతం నాని పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
READ MORE ...
పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత






