- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ అప్పుడేనా?
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. నెక్స్ట్ చేస్తున్న ది ప్యారడైజ్ కూడా మాస్ సినిమానే. ఇది హిట్ 3ను మించిన మాస్ గా ఉంటుందని ఇప్పటికే ఒక అంచనా ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ది ప్యారడైజ్ తో పాటు లిస్టులో ఉన్న పెద్ది నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రాగా.. ఆ సాంగ్ బాగా వైరల్ అయింది. ఎక్కడ చూసినా చికిరి చికిరి సాంగే వినిపిస్తుంది. కానీ ప్యారడైజ్ నుంచి ఇంతవరకూ ఒక్కసాంగ్ కూడా రిలీజ్ కాలేదు. ఇంకెప్పుడూ రిలీజ్ చేస్తారంటూ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు మేకర్స్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మోస్ట్లీ జనవరి సెకండ్ లేదా థర్డ్ వీక్ లో ఫస్ట్ సింగిల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి సాంగ్ రిలీజ్ చేస్తే.. నాని ఫ్యాన్స్ కు పండగే. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.






