Rashmika: సక్సెస్ కోసం ఆ విషయంలో ఎంతో రాజీ పడ్డా.. రష్మిక షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

Rashmika: సక్సెస్ కోసం ఆ విషయంలో ఎంతో రాజీ పడ్డా.. రష్మిక షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక రీసెంట్‌గా ‘పుష్ప-2’ (Pushpa-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ప్రజెంట్ ‘చావా’ (Chaava) చిత్రంతో బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం వహిస్తున్నాడు. దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రష్మిక మహారాణి అవతారంలో కనిపించి మెప్పించింది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న రష్మిక తన పర్సనల్ లైఫ్ (Personal lif) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘నాకు నా ఫ్యామిలీ (Family)నే బలం. ముఖ్యమైన సమయాల్లో కుటుంబంతోనే గడుపుతాను. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజూ మేమిద్దరం మెసేజ్‌లు చేసుకుంటాం. కానీ వరుస షూటింగ్స్ వల్ల తనతో గడిపే సమయాన్ని ఎంతగానో మిస్ అవుతున్నా.. కెరీర్ (career) పరంగా బిజీగా మారడం వల్ల కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపలేకపోతున్నా. ఈ ప్రయాణంలో నేను రాజీపడిన అతిపెద్ద విషయం నా ఫ్యామిలీకి దూరంగా ఉండటం. వ్యక్తిగత (Personal), వృత్తిపరమైన (Professional) విషయాలను ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరోకటి త్యాగం (Sacrifice) చేయాల్సి ఉంటుందని కెరీర్‌లోకి అడుగు పెట్టిన సమయంలో మా అమ్మ చెప్పిన మాట నాకింకా గుర్తుంది. వృత్తి పరమైన కమిట్‌మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.

Next Story