Rashmika Mandanna: విజయ్ దేవరకొండకు రష్మిక క్యూట్ విష్.. నెట్టింట పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2025-05-09 16:46:03.0  )
Rashmika Mandanna: విజయ్ దేవరకొండకు రష్మిక క్యూట్ విష్.. నెట్టింట పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అండ్ విజయ్ దేవరకొండ జోడికి చాలా మంది అభిమానులు ఉన్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. మళ్లీ వీరి కలయికలో మరో సినిమా రావాలని అభిమానులు గట్టిగా కోరుకున్నారు. అందరూ భావించినట్లే.. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట రౌడీ హీరో. అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.ఈ సినిమా మే నెలాఖరు సెట్స్ మీదకు వెళ్లనుందట.

అయితే ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మూవీలో కలిసి నటించినట్లైతే.. ఇద్దరికీ ఇది మూడో సినిమా అవుద్ధి. ఇప్పటికే వీరు డియర్ కామ్రేడ్, గీత గోవిందంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

అయితే నేడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే రష్మిక మందన్న తాజాగా ఆలస్యంగా విష్ చేసింది. ‘‘విజ్జూకు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ చాలా ఆలస్యం చేస్తున్నాను. ప్రేమ ఆనందం ఆరోగ్య సంపద శాంతి, అన్నిటికీ నిండి ఉండాలని నేను ఆశిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.



Next Story

Most Viewed