- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక మందన్న అమ్మనాన్న ఫొటో వైరల్.. వారిని చూసి ఇన్నేళ్లు అవుతుందంటూ నటి పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది. తర్వాత నేషనల్ క్రష్ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత ఈ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్కు జోడిగా ఛమక్ అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో అదర్భుతంగా నటించి.. తన క్యూట్నెస్లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ భామ వరుస చిత్రాలతో అలరించింది.
దేవదాస్, గోత గోవిందం, యజమన, డియర్ కామ్రేడ్, భీషు, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు, సీతారామం, వారసుడు, మిషజ్ మజ్ను, యానిమల్, పుష్ప ది రూల్, ఛావా సికందర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.
అయితే నేడు ఫాదర్స్ డే సందర్భంగా రష్మిక తన అమ్మనాన్నల ఫొటో పంచుకుని వారిపై ప్రేమను చాటింది. ‘‘మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మను, నన్ను, శిమ్మును ఇంతకాలం సూపర్ హీరోలా వీపుపై మోసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నేను మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము. నిన్ను నిజంగా చూసి సంవత్సరం కంటే ఎక్కువ అయ్యింది. త్వరలో నిన్ను కౌగిలించుకోవడానికి నేను వేచి ఉండలేను’’. అంటూ రాసుకొచ్చింది.






