Krrish- 4: క్రిష్ ఫ్రాంచైజీలో నేషనల్ క్రష్.. ఇంట్రెస్టింగ్‌గా మారిన అప్డేట్

by Chukka Sudharani |

సినీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో ‘క్రిష్ 4’ ఒకటి.

Krrish- 4: క్రిష్ ఫ్రాంచైజీలో నేషనల్ క్రష్.. ఇంట్రెస్టింగ్‌గా మారిన అప్డేట్
X

దిశ, సినిమా: సినీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో ‘క్రిష్ 4’ ఒకటి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం 2003లో ‘కోయి.. మిల్ గయా’గా స్టార్ట్ అయింది. తర్వాత.. 2006లో క్రిష్, 2013లో క్రిష్-3గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో క్రిష్- 4 రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ తానే సొంతంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఇక ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాక చోప్రా హీరోయిన్‌గా ఫిక్స్ కాగా.. తాజాగా ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను కూడా ఓ కీలక పాత్ర కోసం అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ చెప్పగా రష్మిక ఓకే చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం రాగా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. క్రిష్-4 ప్రీప్రొడక్షన్ పనులు 2026 ప్రారంభంలో స్టార్ట్ కానుండగా.. 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లింక్

Next Story