‘ఇక నేను చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు’.. నెట్టింట సెన్సేషనల్‌గా మారిన రష్మిక పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు.

‘ఇక నేను చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు’.. నెట్టింట సెన్సేషనల్‌గా మారిన రష్మిక పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది. తర్వాత నేషనల్ క్రష్ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత ఈ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్కు జోడిగా ఛమక్ అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో అదర్భుతంగా నటించి.. తన క్యూట్నెస్లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ భామ వరుస చిత్రాలతో అలరించింది.

దేవదాస్, గోత గోవిందం, యజమన, డియర్ కామ్రేడ్, భీషు, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు, సీతారామం, వారసుడు, మిషజ్ మజ్ను, యానిమల్, పుష్ప ది రూల్, చావా సికందర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ అమ్మడు కుబేర చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రియమైన డైరీ.. నేను ఒక రోజు లండన్‌లో ఉన్నాను. నన్ను నమ్మండి నేను చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు.. కానీ నేను మిమ్మల్ని దాని ద్వారా తీసుకెళ్తాను’’. అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో ఫొటోలు పంచుకుని.. క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. instagram link

Next Story