- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ అప్డేట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో హైప్ పెంచిన మూవీటీమ్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్ కానుంది.
అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అంచనాలను పెంచగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా..‘ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంటర్టైన్మెంట్ స్టార్మ్ ల్యాండ్ అవుతోంది.. ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదలకానున్న నారినారి నడుమ మురారి ట్రైలర్‌తో పూర్తి స్థాయి వినోద సందడిని చూడటానికి సిద్ధంగా ఉండండి.. జనవరి 14 నుండి థియేటర్లలో సంక్రాంతి పండుగ జరుపుకుందాం’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ఈరోజు సాయంత్రం 4గంటల 5నిమిషాలకు ట్రైలర్ లాంచ్ కానున్నదని హీరో ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






