మ‌హేష్‌, బ‌న్నీ,నాని త‌ర్వాత అంత‌టి మొన‌గాడు అబ్బ‌వ‌ర‌మే !

by velandi.Saikiran |

నటుడు నరేష్... కిరణ్ అబ్బవరంను మెచ్చుకుంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని తర్వాత

మ‌హేష్‌, బ‌న్నీ,నాని త‌ర్వాత అంత‌టి మొన‌గాడు అబ్బ‌వ‌ర‌మే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకరు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాంటి కిరణ్ అభవరం గత ఏడాది క సినిమాతో ( KA) దుమ్ము లేపాడు. ఇక ఇప్పుడు కే ర్యాంప్ ( K-Ramp) సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ మాట్లాడారు. కిరణ్ అబ్బవరంను మెచ్చుకుంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని తర్వాత కిరణ్ అబ్బవరం ఆ రేంజ్ కు వెళ్తాడని వెల్లడించారు నరేష్. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేయగల హీరో కిరణ్ అబ్బవరం మాత్రమే అని పొగిడారు. ఇలాంటోడిని జనాలు ఆదరించాలని కోరారు. ఇది ఇలా ఉండ‌గా, ఈ సినిమాకు జైన్స్ నాని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క్లిక్

Next Story