Nara Rohit: అందుకే వార్-2 చూడలేదు.. ఎన్టీఆర్ మూవీపై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

ఈ ఏడాది ‘భైవరం’ సినిమాతో వచ్చిన హిట్ అందుకున్న నారా రోహిత్ (Nara Rohit).. ప్రస్తుతం ‘సుందరకాండ’ (Sundarakanda) మూవీతో బిజీగా ఉన్నాడు.

Nara Rohit: అందుకే వార్-2 చూడలేదు.. ఎన్టీఆర్ మూవీపై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘భైవరం’ సినిమాతో వచ్చిన హిట్ అందుకున్న నారా రోహిత్ (Nara Rohit).. ప్రస్తుతం ‘సుందరకాండ’ (Sundarakanda) మూవీతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijay Kumar), వృతి వాఘాని హీరోయిన్స్‌గా నటిస్తున్నాడు. సంతోష్ చిన్న పొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నర్మిస్తున్నారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా రోహిత్.. ఎన్టీఆర్ (NTR) వార్-2 చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘నాది ఆడియన్స్ మైండ్ సెట్. ట్రైలర్ నచ్చకపోతే సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ పెట్టను. కూలీ చిత్రం ట్రైలర్ నచ్చింది. ఇక ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లాం.. మూవీ అంతగా నచ్చలేదు.. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఎంజాయ్ చేశాను. మొత్తంగా కూలీ (coolie) సినిమా ఓకే అనిపించింది.. ఒకసారి చూడొచ్చు. ఇక మా ఫ్రెండ్స్ కూలీ చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో ఆ మూవీకే వెళ్లాము.. అందుకు వార్-2 చూడలేదు’ అని తెలిపాడు.

అలాగే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ (Mokshagna) ఇండస్ట్రీ ఎంట్రీపై మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞ తన తొలి సినిమా కోసం ఒక జోష్ ఫుల్ ప్రేమకథ కోసం చూస్తున్నానని నాకు చెప్పాడు. అన్నీ కుదురితే అతని సినిమా ఈ సంవత్సరం ఎండింగ్‌లో లేదా.. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో స్టార్ట్ అవుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Next Story