- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక మధురమైన విజయం అంటూ శారీ ఫొటోస్ షేర్ చేసిన నాని హీరోయిన్.. గార్జియస్ అంటూ కామెంట్స్
కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన హిట్-3 మూవీతో ఈ ముద్దుగుమ్మ మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా భారీ విజయంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా ఈ బ్యూటీ ప్రజెంట్ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉండే శ్రీనిధి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో హిట్-3 మూవీ సూపర్‌గా సక్సెస్ అవుతున్నందుకు బ్లాక్ శారీలో అదిరిపోయే ఫొటోస్‌ను షేర్ చేసింది. అంతేకాకుండా వాటికి ‘గుర్తుంచుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఒక రాత్రి, ఆ తర్వాత వచ్చినది ఒక మధురమైన విజయం #HIT3’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






