- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాని నా బాడీ షేపులు గురించి అలా అన్నాడు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ నటి స్నిగ్ధ(snigdha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి స్నిగ్ధ(snigdha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు 2011లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఒక్క క్షణం, విజేత, టైగర్, జత కలిసే, గుంటూరు టాకీస్(Guntur Talkies), మేం వయసుకు వచ్చాం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా 2019లో వచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ మూవీలోనూ స్నిగ్ధ కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే ఆమె నిత్యం అబ్బాయిల బట్టలు వేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నిగ్ద షాకింగ్ కామెంట్స్ చేసింది. అబ్బాయిలా మారడానికి ఇవన్నీ జరుగుతున్నాయా ఏంటి? అని యాంకర్ అడగ్గా.. దానికి స్నిగ్ద.. ‘‘అదే నాకు అర్థం కావడం లేదు. నా ఫ్రెండ్స్ కూడా పదే పదే అదే అడుగుతుంటారు. ఎలారా ఇంతగా సైడ్ లాక్స్ వస్తాయి నీకు అని.. నాని అడుగుతూ ఉంటారు. ఒరేయ్ కరెక్ట్‌గా నీకు ఆ షేపులు ఎలా వస్తాయిరా అని. చూడడానికి ఇంత పర్ఫెక్ట్ సైడ్ లాక్స్ ఎలా వస్తాయి అనేది నాకు తెలియదు. వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అందరూ నన్ను అబ్బాయి అనుకుంటారు. నాబాడీ లాంగ్వేజ్ వలను కావచ్చు. పెరిగిన వాతావరణం అనేది తెలియదు కానీ.. ఇవన్నింటి వల్ల నేను అబ్బాయిగా మారాను అనుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చింది.
అలాగే తనకు ఒకానొక సమయంలో ఊహించని సంఘటన ఎదురైనట్లు వెల్లడించింది. ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్‌లో ఆడుకుంటుండగా అక్కడి ఒకతను వచ్చాడు. నన్ను ఈడ్చుకుంటూ పొదల చాటుకు తీసుకెళ్లి రేప్ అటెంప్ట్ చేశాడు. ఆ ఘటన నుంచి కోలుకోవడానికి నాకు పదేళ్లు పట్టింది. ఇప్పుడు కూడా రాత్రిపూట.. నా బెడ్‌పై మా నాన్న పడుకున్నా మామ పడుకున్నా భయమేస్తుంది. నాతో ప్రేమతో ఉన్నప్పటికీ జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది అని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం స్నిగ్ద కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






