- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి నాని పోస్ట్.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’. ఈ మూవీలో కేజీఎఫ్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న నటి శ్రీనిధి కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న ఈ చిత్రం మే 1 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాదులో ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి విచ్చేశాడు. అలాగే టాలీవుడ్ హీరోలైన విశ్వక్ సేన్ అండ్ నటుడు అడివి శేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. అంతా సినిమాలో సగం వరకు ప్రేమ కథనే ఉంటుందని అనుకుంటున్నారని.. కానీ అలాంటిదేం ఉండదని వెల్లడించారు. ఈ మూవీని జక్కన్న మార్నింగ్ షో వీక్షించాలని కోరుకుంటున్నానని నాని అన్నారు. ఏవైనా పనులు ఉంటే.. పాస్‌పోస్ట్ లాగేసుకుంటానని తెలిపారు.
తాజాగా నాని సోషల్ మీడియా వేదికన ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు. రాజమౌళి, విశ్వక్ సేన్, అడవి శేష్, హీరోయిన్ శ్రీనిధిలతో దిగిన ఫొటోలు నాని పంచుకున్నారు. ఈ పిక్స్‌కు ‘‘నిన్న రాత్రి చాలా బాగా గడిచింది. హిట్ 3 మే 1 వ తారీకున ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని ఓ క్యాప్షన్ కూడా జోడించారు.






