Nani: ఆ విధానం మారితేనే అందరూ బాగుంటారు.. హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న లేటెస్ట్ తెలుగు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’.

Nani: ఆ విధానం మారితేనే అందరూ బాగుంటారు.. హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న లేటెస్ట్ తెలుగు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’. ఇప్పటికే ఈ షో నుంచి పలు ఎపిసోడ్స్ రాగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షోకు నేచురల్ స్టార్ నాని హాజరు కాగా.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా.. ఒక సినిమా రిలీజ్ ఉంటే.. అప్పుడు రెండు, మూడు సినిమాలు కూడా రిలీజ్‌కు ఉన్నాయని కాంపిటీషన్‌గా చూస్తారు.. అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే మా వాడి సినిమా ఆడాలి.. ఇంకొకడిది ఆడొద్దు అని అనుకుంటారు.

అందరికి అర్థం కానీ విషయం ఏంటంటే.. సినిమాలు అన్నీ ఆడితే మీది ఆడుతుంది.. ఏది ఆడకపోతే మీది కూడా ఆడదు. అందుకే నేను అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాను. నేను ఇంట్లో ప్రెయర్ చేయనిదే బయటకు రాను.. అలాగే నా సినిమా రిలీజ్ ఉన్నప్పుడు వేరే సినిమాలు కూడా రిలీజ్ ఉంటే.. నాకు గుర్తుకు వచ్చిన అన్ని సినిమాల పేర్లు నా ప్రెయర్‌లో చెప్తా. ఎందుకంటే అన్ని బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మనమే బాగోవాలి అని కోరుకుంటే మనతో పాటు ఎవరికి మంచి జరగదు. అందరూ బాగుండాలి అనేది డెవలప్ అయితే.. ఆ బ్లెస్సింగ్స్ మనకు కూడా వస్తాయి. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. మనమే అనే ఆలోచన మారాలి’ అని తెలిపాడు నాని.

Next Story