- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాని దూకుడు.. బాలీవుడ్‌ను దాటేసిన టాలీవుడ్ నేచురల్ స్టార్..!
వరస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ, స్తబ్దుగా ఉన్న థియేటర్లలో కొత్త ప్రాణం పోశాడు నేచురల్ స్టార్ నాని..!

దిశ, వెబ్ డెస్క్: వరస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ, స్తబ్దుగా ఉన్న థియేటర్లలో కొత్త ప్రాణం పోశాడు నేచురల్ స్టార్ నాని.. తన సొంత నిర్మాణంలో వచ్చిన 'కోర్ట్'తో ఒక సంచలనం సృష్టిస్తే, ఆ వెంటనే 'హిట్ 3'లో నటనతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టాడు. ఇక్కడితో ఆగకుండా, 'ది ప్యారడైజ్ గ్లింప్స్'తో ఒక మెరుపుతీగలా వచ్చి, యావత్ సినీ ప్రపంచాన్ని నిశ్శబ్దంలోకి నెట్టేశాడు.
ఒక్కసారిగా సినీదేశం దృష్టిని ఆకర్షించి.. జూన్ నెలకు గాను ఓర్మాక్స్ ఆల్-ఇండియా టాప్ 10 మేల్ ఫిల్మ్ స్టార్స్ జాబితాలో నాని పేరు మెరిసింది.. 'హిట్ 3' ఓటీటీలో విడుదలైన తర్వాత, నాని నటన దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించింది. ఇక 'ది ప్యారడైజ్ గ్లింప్స్'లో ఆయన సరికొత్త లుక్, ఆ గ్లింప్స్ సృష్టించిన వైబ్రేషన్స్ దేశం నలుమూలలా చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం ఒక ఆరంభం.. ఆయన తీసుకుంటున్న తెలివైన నిర్ణయాలు, చేస్తున్న వైవిధ్యమైన సినిమాలు ఆయన పాపులారిటీని ఆకాశానికి చేర్చుతున్నాయి. ప్రతి అడుగులో ఒక ఉత్కంఠభరితమైన మలుపు..
ప్రస్తుతం, నాని తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో యాక్షన్ స్టంట్స్.. సాధారణమైనవి కావు.. అవి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్నాయని వినికిడి.
ఇదొక సాధారణ విజయం కాదు.. ప్రభాస్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, దళపతి విజయ్, అజిత్, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి దిగ్గజాల సరసన నాని నిలవడం.. ఆయన నిరంతర కృషికి, అంకితభావానికి నిదర్శనం.. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నాని తన కెరీర్‌లో సాధించబోయే మరిన్ని విజయాలకు ఇది ఒక నాంది..!






