- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్-శ్రీకాంత్ ఓదెల సినిమాపై హైప్ పెంచిన నాని.. ఫుల్ ఖుషీలో అభిమానులు (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. అయితే చిరు, హిట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబోలో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలై అందరిలో అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మిస్తుండటం మరో విశేషం. దీనికి సంబంధించిన షూటింగ్ మొదలు కానప్పటికీ అందరి దృష్టి మాత్రం ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని(Nani) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని మనం ఒక అభిప్రాయానికి వచ్చేశాం..కానీ ఆయన అంతుకుమించి.. చిరంజీవి కేవలం అది మాత్రమే కాదు.. ఆయన్ని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా భావిస్తాం.. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైనో ఫోకస్ చేస్తున్నాం.
ఇప్పుడు శ్రీకాంత్ మ్యాడ్‌నెస్‌ని చిరంజీవి గారి సినిమాలో అనగానే అది చాలా సూపర్ కాంబో.. అందుకే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.. ఇది నిజంగా నాకు ఓ గర్వకారణం.. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారి లాంటి స్థాయి వ్యక్తిని పెట్టి నేను ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు.. కానీ అనుకోకుండా ఇది కుదిరింది.. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా.. ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నాని కామెంట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అంతా చర్చించుకుంటున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం ఆనందపడుతున్నారు.
#Chiranjeevi Garu isn’t just about action and dance. he’s much more than that!
— The Cine Gossips (@TheCineGossips) April 1, 2025
We’re working hard to bring back the side of him that fans have been missing lately. & It’s a huge responsibility for me!
- #Nani #HIT3 #TheParadise #ChiruOdelaCinema pic.twitter.com/0QW4TUIEUJ






