శేఖర్ కమ్ములను వేధిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో!

by velandi.Saikiran |

టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన రెండు మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా తీసినప్పటికీ.. ఆ సి

శేఖర్ కమ్ములను వేధిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన రెండు మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా తీసినప్పటికీ.. ఆ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాల్సిందే. ఆయన సినిమా తీశాడంటే మినిమం గ్యారంటీ హిట్ ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ ఉండదు. అంతలా శేఖర్ కమ్ముల... పాపులర్ అయ్యారు. అలాంటి శేఖర్ కమ్ముల ఇటీవల కుబేర సినిమా తీసిన సంగతి తెలిసిందే.

హీరో ధనుష్, నాగార్జున అలాగే రష్మిక ముగ్గురితో కుబేర సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. దీంతో ఇండస్ట్రీలో మళ్ళీ ఆయన డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం ఆయన.. నాచురల్ స్టార్ నానితో సినిమా చేయాలని అనుకుంటున్నారట. కానీ నాని మాత్రం.. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలంటే రెండు సంవత్సరాల సమయం కావాలని అంటున్నాడట. ప్రస్తుతం హీరో నాని ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో కూడా నాని సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అంటే సుజిత్ దర్శకత్వంలో వచ్చే సినిమా పూర్తి కావాలంటే కనీసం ఏడాది పడుతుంది. అంటే రెండు సంవత్సరాలు అయినా కూడా శేఖర్ కమ్ములకు నాని దొరికే ఛాన్స్ లేదని తెలుస్తోంది. కానీ నానితో సినిమా చేయాలని శేఖర్ కమ్ముల మొదటి నుంచి ప్లాన్ చేస్తున్నారట. కానీ నాని డేట్స్ మాత్రం.. ఇప్పుడు అస్సలు దొరికేలా కనిపించడం లేదు.

Next Story