‘బాలయ్య’ కోసం భారీ ప్లాన్‌...ఇంట‌ర్వెల్ సీన్ అదిరిపోవాల్సిందే !

by velandi.Saikiran |

‘బాలయ్య’ సినిమాలో ఇంట‌ర్వెల్ సీన్ అదిరిపోనుంద‌ని టాక్ న‌డుస్తోంది.

‘బాలయ్య’  కోసం భారీ ప్లాన్‌...ఇంట‌ర్వెల్ సీన్ అదిరిపోవాల్సిందే !
X

దిశ‌, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రజా ప్రతినిధిగా తనవంతు పాత్ర పోషిస్తూనే.. ఇటు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు బాలయ్య. అయితే అలాంటి నందమూరి బాలయ్య త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్ లో ఉంటుందట. గూస్ బంప్స్ వచ్చేలా చేసేందుకు దర్శకుడు కొరటాల శివ రంగం సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ ఇంటర్వెల్ సీన్ కోసం భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్ లో సినిమాలో నటించే తారాగణం మొత్తం కనిపించబోతున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ఆగస్టు మాసంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో నందమూరి బాలయ్య మాఫియా పాత్రలో కనిపించబోతున్నారని చెబుతున్నారు. కాగా ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Next Story