చిన్నారి ప్రాణం కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తున్న హీరో బాలకృష్ణ

by Chukka Sudharani |   (  Updated:2026-04-10 11:44:13  IST  )

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట సింహం బాలకృష్ణ.. తాజాగా రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నారు.

చిన్నారి ప్రాణం కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తున్న హీరో బాలకృష్ణ
X

దిశ, సినిమా: రీల్ లైఫ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట సింహం బాలకృష్ణ.. తాజాగా రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నారు. ఈ మేరకు తన నియోజకవర్గంలోని ఒక చిన్నారి ప్రాణాపాయ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్నా ఆయన.. ఆయన వంతు సహాయం అందిస్తానని చెబుతూనే.. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ వేదికగా.. ఓ పోస్ట్ షేర్ చేశారు.

‘అందరికీ నమస్కారం.. మన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామ నివాసి నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) ‘స్పైనల్ మస్క్యలర్ అట్రోఫీ టైప్ 2’ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం బేబీ కేయాన్స్ అడ్విక్ గత 21 నెలలుగా ప్రాణాపాయమైన ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి అవసరమైన జీవరక్షక ఔషధం AVXS-101 (Onasemnogene Abeparvovec) భారతదేశంలో తయారు కావడం లేదు. ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన జీవరక్షక ఇంజెక్షన్ ధర: ₹16 కోట్లు ఉంది. ఈ కుటుంబం గురువారం హిందూపురం పర్యటనలో ఉన్న నన్ను కలిసి తమ బిడ్డ పరిస్థితిని తెలియజేసి మనందరి సహాయాన్ని కోరుకున్నారు. ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదు కాబట్టి.. నా వంతుగా నేను సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగా కూడా నా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ.. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమవంతు సాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.. అకౌంట్ వివరాలు: Account- 8265662545, Name - A S Nataraj, IFSC - IDIB000J028, Branch - J P NAGAR’ అని తెలిపారు.

Next Story