Daku Maharaj: పీక్ స్టేజ్‌లో బిగ్ షాక్.. థమన్‌పై ఫ్యాన్స్ ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-12 08:22:25  IST  )

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా శనివారం విడుదలై విజయంతంగా ప్రదర్శించబడుతోంది...

Daku Maharaj: పీక్ స్టేజ్‌లో   బిగ్ షాక్.. థమన్‌పై ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ(Nandmuri Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) సినిమా శనివారం విడుదలైంది. అత్యధిక థియేటర్లలో డాకు మహారాజు సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఏపీలో తెల్లవారుజాము నుంచే షోలు వేస్తున్నారు. దీంతో అభిమానులు ఎగబడి మరీ సినిమాను చూస్తున్నారు. బాలకృష్ణ డైలాగ్స్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

ఓ చోట సడెన్ సౌండ్ నిల్


అయితే ఓ చోట అభిమానులకు ‘డాకు మహారాజ్’ షాక్ ఇచ్చారు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో సడెన్‌గా సౌండ్ నిలిచిపోయింది. ఇందుకు కారణం సౌండ్ బాక్సులేనని అభిమానులు చెబుతున్నారు. థమన్ అందించిన సంగీతం వల్ల సినిమా మధ్యలో సౌండ్ బాక్సులు పని చేయలేదని ఫైర్ అయ్యారు. ఇందుకు కారణం థమన్ అని, సినిమా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రదర్శించాలని, లేని పక్షంలో మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫైర్ అయి చల్లబడిన అభిమానులు


మరోవైపు సౌండ్ నిలిచిపోవడంతో సినిమా థియేటర్ యాజమాన్యం స్పందించింది. సిబ్బందిని పెట్టి మరమ్మతులు చేపట్టింది. సౌండ్ బాక్కులు రెడీ అయిన తర్వాత సినిమాను కొనసాగిస్తామని తెలిపారు. దీంతో అభిమానులు చల్లబడ్డారు. సౌండ్ బాక్కుల మరమ్మతుల తర్వాత మళ్లీ చూస్తామని తెలిపారు. ఇక ఇప్పటి వరకూ చూసిన చాలా బాగుందని, మిగిలిన పార్ట్ కూడా చాలా నచ్చుతుందని పేర్కొన్నారు.

Next Story