యూఎస్ మార్కెట్ లో బాలయ్య అరుదైన ట్రాక్ రికార్డు

by Naga Rani Yarlagadda |

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా..

యూఎస్ మార్కెట్ లో బాలయ్య అరుదైన ట్రాక్ రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా.. సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన సినిమా అఖండ 2 తాండవం. 2021లో విడుదలైన అఖండకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాతో బాలయ్య అమెరికాలో అరుదైన ట్రాక్ రికార్డు సాధించారు. నార్త్ అమెరికాలో బాలయ్య నటించిన ఐదు సినిమాలు వరుసగా 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్నాయి.

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాగు మహారాజ్, అఖండ 2 సినిమాలు వరుసగా 1 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేయడం విశేషం. ఒక హీరో నటించిన సినిమాలు.. అది కూడా వరుసగా ఐదు సినిమాలు 1 మిలియన్ దాటడం వెరీ రేర్ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కూడా మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఏకంగా 6 సినిమాలతో ఈ రికార్డు సాధించిన ఏకైక హీరోగా బాలయ్య యూనిక్ ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు.

Next Story