- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhanda 2: వారణాసిలో అఖండ 2 టీం..పంచకట్టులో బాలయ్య
డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన అఖండ 2 సినిమా, థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లు క్రాస్

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య తాజాగా నటించిన అఖండ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి మెయిన్ విలన్ గా మెరిశారు. హిందుత్వం, ఆధ్యాత్మికం, శివుడు చుట్టే తిరిగిన ఈ అఖండ 2 సినిమాను, చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన అఖండ 2 సినిమా, థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లు క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకు వెళ్తోంది. అయితే ఈ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో బాలయ్య బోయపాటి శ్రీను ఇద్దరు కూడా వారణాసిలో మెరిశారు. వారణాసిలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకున్న అఖండ 2 టీమ్ సాంప్రదాయ దుస్తులో మెరిసింది. నందమూరి బాలయ్య అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను ఇద్దరు కూడా పట్టు వస్త్రాల్లో కనిపించి సందడి చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. క్లిక్






