namratashirodkar: ‘నీ దగ్గర నా హృదయం ఉంది’.. నెట్టింట వైరలవుతోన్న సూపర్‌స్టార్ సతీమణి పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్.. ఒకప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలిచిన నటి.

namratashirodkar: ‘నీ దగ్గర నా హృదయం ఉంది’.. నెట్టింట వైరలవుతోన్న సూపర్‌స్టార్ సతీమణి పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్.. ఒకప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలిచిన నటి. నమ్రత 1993లో మిస్ ఇండియా పోటీలో గెలిచింది. యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. నమ్రత శిరోద్కర్ బాలీవుడ్, కన్నడ, మలయాళం, తెలుగు భాషలలో సినిమాలు చేసింది. అలాగే మహేష్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటించే క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

నమ్రత 2005లో సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు గౌతమ్ అండ్ కుమార్తె సితారలకు జన్మనిచ్చారు. నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. తన వ్యక్తిగత జీవితం ద్వారా అభిమానులకు దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. ఆమె సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానని చెప్పింది. నమ్రత తన కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి చాలా సంతోషంగా ఉంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిరంతరం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది.

ఘట్టమనేని ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకున్న నమ్రజ శిరోద్కర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కుమార్తె, కుమారుడితో కలిసి ఫొటోలు పంచుకుని.. ‘‘సెయింట్ ట్రోపెజ్, నీకు నా హృదయం ఉంది’’. అని ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. హాలీడేస్ సందర్భంగా వీరు వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక నమ్రత మిస్ వరల్డ్ పోటీలకు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ‘‘అద్భుతమైన పోటీదారులందరికీ అభినందనలు. మీరందరూ అద్భుతంగా ఉన్నారు. ఎంత అద్భుతమైన సాయంత్రం.జూలియామోర్లీని కలవడం కూడా చాలా అందంగా ఉంది. @suchaata — మిస్ థాయిలాండ్, మిస్ వరల్డ్ 2025కి అతిపెద్ద చీర్స్’’ అని ఈ విషయాన్ని కూడా నెట్టింట పంచుకుంది.

Next Story