మరోసారి సంక్రాంతిని టార్గెట్ చేసిన నాగవంశీ?

by Pulgam srinivas |

కార్తీ హీరోగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని నిర్మాత నాగవంశీ వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోసారి సంక్రాంతిని టార్గెట్ చేసిన నాగవంశీ?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా, మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయంలో నాగవంశీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన నిర్మించిన అనేక చిత్రాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ ఏడాది అనగనగా ఒక రాజు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కార్తీతో రూపొందుతున్న ఈ సినిమాను కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గుంటూరు కారం, అనగనగా ఒక రాజు చిత్రాల్లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించడం విశేషం. అదే బ్యానర్‌లో ఆమె నటిస్తున్న మూడో సినిమా కూడా సంక్రాంతికే విడుదల కానుందనే వార్తలతో మరోసారి సంక్రాంతి సినిమాతో ఈ బ్యూటీ హిట్ అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Next Story