Nagarjuna: ఆ నోటిఫికేషన్స్ యాక్సెస్ట్ చేస్తే మన జీవితం మార్చేసుకోవాలి.. సోషల్ మీడియాపై నాగార్జున్ కామెంట్స్

by Chukka Sudharani |

సోషల్ మీడియా వచ్చాక చాలా మంది తమ పర్సనల్ లైఫ్‌ను మిస్ అయిపోతున్నారు.

Nagarjuna: ఆ నోటిఫికేషన్స్ యాక్సెస్ట్ చేస్తే మన జీవితం మార్చేసుకోవాలి.. సోషల్ మీడియాపై నాగార్జున్ కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా వచ్చాక చాలా మంది తమ పర్సనల్ లైఫ్‌ను మిస్ అయిపోతున్నారు. వైరల్ అయ్యేందుకు లేదా టైమ్ పాస్‌లో ఏదో రకంగా ఎక్కువ గంటలు సోషల్ మీడియాలోనే బతికేస్తున్నారు. అయితే.. ఈ రోజుల్లో కూడా కొంతమంది సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారు అంటే నమ్మశక్యం కానప్పటికీ.. వారిలో నేను కూడా ఉన్నా అంటున్నాడు అక్కినేని కింగ్ నాగార్జున. ఈ ఏడాది కుబేర, కూలీ వంటి చిత్రాలతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈయన ప్రస్తుం. 100వ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు నడుస్తుండగా.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున సోషల్ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘నేను ట్విట్టర్ వచ్చిన కొత్తలో అకౌంట్ ఓపెన్ చేశాను. అందులో కొన్ని నొటిఫికేషన్స్ వచ్చేవి. వాటిని మనం క్లిక్ చేస్తే మన జీవితం మొత్తం మార్చేసుకోవాలి.. ఎందుకంటే రేపు ఏం చేయాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి ఇలా సలహాలు ఇచ్చే వాళ్లు ఎక్కువ ఉంటారు. లేదా నెగిటివి ఉంటుంది. ఇలా వాళ్లు చెప్పింది చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఎవరో తెలియని అనామకులు మన లైఫ్‌ను ఎందుకు లీడ్ చేయాలి.. మన జీవితం ఇంకొకరి హ్యాండోవర్‌లోకి వెళ్లడం ఏంటి అని ఆలోచించా.. నా మీద నాకే అసహ్యం వేసింది. నా లైఫ్ నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అప్పటినుంచి నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసేశాను.. దాదాపు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నాను’ అని తెలిపారు.

Next Story