- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులూమనాలీలో కింగ్ నాగార్జున!
అక్కినేని హీరో కింగ్ నాగార్జున తన ‘కింగ్ 100’ వ చిత్రం కోసం కులూమనాలీకి వెళ్లినట్లు టాక్.

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కింగ్-100 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ కాగా.. దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే.. కింగ్ 100 చిత్రాన్ని ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఇందులో నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘కింగ్ నాగార్జున 100వ సినిమా షూటింగ్ ప్రస్తుతం కులూమనాలీలో జరుగుతోంది. మే నాటికి నాగార్జునకు సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేస్తారు’ ఓ పోస్ట్ వైరల్ కాగా.. ఎగ్జైటెడ్ అని, టైటిల్ పోస్టర్ కానీ, గ్లింప్స్ కానీ వదలండీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.






