Nagarjuna: ఇలాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి.. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

by Chukka Sudharani |   (  Updated:2025-06-19 15:56:21  IST  )

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’.

Nagarjuna: ఇలాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి.. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున తాజాగా మీడియాతో ముచ్చటించారు.

‘మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నతో(ఏఎన్ఆర్), ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు.. ఇలా అంతమందితో కలిసి ఎన్నో సినిమాలు చేశారు. శేఖర్ కమ్ములతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి. కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్‌కి ఈ పాయింట్ మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్స్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. శేఖర్ నా క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా రాశారు. ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్... అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్‌లో ఉంటాయి. ఇందులో అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి. కుబేర ఆడియన్స్‌కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని తెలిపారు.

Next Story