- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.. ‘గత వైభవవం’పై నాగార్జున కామెంట్స్ వైరల్
ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవవం’.

దిశ, సినిమా: ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవవం’. సింపుల్ సుని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత వైభవం సినిమా గురించి ఆషికా చెబుతూనే ఉంది. తను ఈవెంట్‌కి రావాలని అడగడం, నేను వచ్చేయడం వెంటనే జరిగిపోయాయి. నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం.
నాన్నసినిమా మూగమనసులతో నాకు బాగా పరిచయం. నేను అదే ఇష్టంతో జానకి రాముడు సినిమా చేశాను. రెండు సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. గత జన్మలు అనేది మన కల్చర్‌లో ఉండిపోయిన ఒక కథ. మనం చిన్నప్పుడు నుంచి వింటుంటాం. గత వైభవం నాలుగు జనరేషన్ల కథ, ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’ అని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.






