- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరలో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసిన నాగార్జున బ్యూటీ.. మిస్ యూనివర్సల్ అంటూ కామెంట్స్
‘రాఘవేంద్ర’(Raghavendra) సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అన్షు(Anshu) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘రాఘవేంద్ర’(Raghavendra) సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అన్షు(Anshu) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున(Nagarjuna) నటించిన ‘మన్మథుడు’(Manmadhudu) మూవీలో నటించి మెప్పించింది. అలా ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. కానీ ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైంది. ఇక రీసెంట్‌గా ‘మజాకా’(Majaka) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అన్షు తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ చీరలో, బొట్టు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ట్రెడిషనల్ వేర్‌లో కనిపించింది. ‘వజ్రం కాదు, కానీ నేను ఇంకా ప్రకాశిస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మిస్ యూనివర్సల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






