- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కొడుకు సినిమాల్లో నువ్వు వద్దు.. జగపతిబాబును అవమానించిన నాగార్జున?
నా కొడుకు అఖిల్ సినిమాలో జగపతిబాబును అస్సలు తీసుకోవద్దని అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నా కొడుకు అఖిల్ సినిమాలో జగపతిబాబును అస్సలు తీసుకోవద్దని అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఓ నిర్మాతగా, బడా హీరోగా, హోస్ట్ గా, పెద్ద వ్యాపారవేత్తగా సక్సెస్ఫుల్ స్టార్ గా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున.
తన కొడుకుల సినిమాలు ఎలా ఉన్నా..? అక్కినేని నాగార్జున మాత్రం మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి అందరిని మెప్పించారు. అయితే అలాంటి అక్కినేని నాగార్జున క్యారెక్టర్ ను జగపతిబాబు షోలో బయటపెట్టారు. జగపతిబాబు ఆధ్వర్యంలో తాజాగా ఓ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జునను రకరకాల ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు జగపతిబాబు.
నీ కొడుకు పెళ్లికి నన్ను పిలవలేదని.. ఇంటర్వ్యూలోనే నిలదీశారు జగపతిబాబు. అంతేకాదు అఖిల్ సినిమాలో... ఓ పాత్ర వస్తే తనను కాదని.. వేరే వాళ్లకు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే.. అఖిల్ సినిమాలో చిన్న పాత్ర ఉందట. అందుకోసం జగపతిబాబును తీసుకుందామని దర్శకుడు చెప్పినట్లు తెలుస్తోంది. అలాంటి చిన్న పాత్రలు జగపతిబాబుకు వద్దు... పెద్ద పాత్రలు ఇవ్వాలి... అతని స్టేటస్ చాలా పెద్దది అని నాగార్జున చెప్పుకొచ్చారట. ఈ విషయాన్ని జగపతిబాబు రివీల్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో అందరూ అక్కినేని నాగార్జున అని మెచ్చుకుంటున్నారు. క్లిక్






