Nagarjuna: నేనే ఇందులో హీరోని.. తన 100వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

by Chukka Sudharani |

కుబేర, కూలీ వంటి చిత్రాలతో పలకరించిన నాగార్జున.. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు

Nagarjuna: నేనే ఇందులో హీరోని.. తన 100వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: కుబేర, కూలీ వంటి చిత్రాలతో పలకరించిన నాగార్జున.. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. నాగార్జున కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నట్లు, ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు హాజరైన నాగార్జున తన 100వ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నా 100వ సినిమా చెయ్యబోతున్నాను. దీనికి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చాలా గ్రాండ్ సినిమా.. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ నటుడుస్తుంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాము.. ఇది మంచి యాక్షన్, ఫ్యామిలీ, డ్రామా సినిమా & నేనే ఇందులో హీరోని’ అంటూ తెలిపాడు. కాగా.. ఈ ఏడాది వచ్చిన కుబేర, కూలీ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించిన నాగార్జున.. తన 100వ చిత్రానికి మాత్రం తానే హీరో అంటూ ప్రకటిస్తూ నవ్వులు పూయించాడు.

Next Story