- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagarjuna: ఎట్టకేలకు కొడుకు సినిమా సక్సెస్‌పై స్పందించిన నాగార్జున.. ట్వీట్ వైరల్
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా మూవీ ‘తండేల్’(Thandel).

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్(allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. అయితే గత మూడేళ్లుగా ఫ్లాప్స్‌తో సతమతం అవుతోన్న యువసామ్రాట్ ఎలాగైన హిట్ సాధించాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 7న మనముందుకు వచ్చాడు. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ టాక్ తెచ్చుకుంది.
అంతే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) అందించిన మ్యూజిక్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తండేల్ మూవీ చూసిన వారు చాలా బాగుందని ఆడియన్స్, ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్కినేని నాగార్జున(Nagarjuna) తన కొడుకు సినిమా ఇంతటి సక్సెస్ సాధించడంతో ఈ మూవీపై స్పందించారు.
ఈ మేరకు ఎక్స్(X) వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. “ప్రియమైన చైతు.. నేను గర్వపడుతున్నాను. సరిహద్దులను దాటిపోతూ, సవాళ్లను ఎదుర్కొంటూ కళకు నీ గుండెను ఇచ్చినట్లు చూశాను. తండేల్.. ఇది కేవలం నీ సినిమా కాదు. నీ అభిరుచి, నీవు కష్టపడి సాధించిన విజయానికి నిదర్శనం. అలాగే అక్కినేని అభిమానులందరూ మీరు కుటుంబంలా మాకు అండగా నిలిచారు, తండేల్ విజయం మాది కాదు మనందరిది. మీ అంతులేని ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు.
అలాగే అల్లు అరవింద్ గారికి బిగ్ థాంక్స్. అండ్ బన్నీ వాసు గారికి అభినందనలు, సాయి పల్లవి నీ నటనతో మరోసారి మమ్మల్నందరినీ ఆశ్చర్యానికి గురి చేశావు. అండ్ మేధావి అయినటువంటి దేవీశ్రీ ప్రసాద్ మీరు రాక్ అంతే, రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి గారికి అండ్ ఈ క్షణాన్ని మరిచిపోలేని విధంగా చేసిన అద్భుతమైన తండేల్ బృందానికి కంగ్రాట్స్” అంటూ రాసుకొచ్చారు నాగార్జున. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.






