మా హీరోను అంత నీచంగా చూపిస్తావా? లోకేష్‌పై నిప్పులు చెరుగుతున్న నాగ్ ఫ్యాన్స్!

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన కూలీ సినిమా ఈ నెల 14న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించగా నాగ్ నెగిటివ్ రోల్‌లో కనిపించారు.

మా హీరోను అంత నీచంగా చూపిస్తావా? లోకేష్‌పై నిప్పులు చెరుగుతున్న నాగ్ ఫ్యాన్స్!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన కూలీ సినిమా ఈ నెల 14న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించగా నాగ్ నెగిటివ్ రోల్‌లో కనిపించారు. ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వస్తోంది. లోకేషన్ కనకరాజ్ గతంలో తీసిన ఖైదీ, విక్ర‌మ్ లాంటి సినిమాల‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో కూలీకి కూడా విడుద‌ల‌కు ముందే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఆ అంచ‌నాల కార‌ణంగానే సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై నాగార్జున అభిమానులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోల లిస్టులో నాగార్జున కూడా స్టార్ హీరో. అలాంటిది అంత త‌క్కువ చేసి చూపిస్తావా అంటూ లోకేష్ క‌న‌క‌రాజ్ పై ఫైర్ అవుతున్నారు. కూలీ సినిమాలో నాగార్జున పాత్ర‌కు అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కార‌ణం అని తెలుస్తోంది. లోకేష్ క‌న‌క‌రాజ్ తీసిన విక్ర‌మ్ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్ రోల్ ఓ రేంజ్ లో ఉంటుంది. అస‌లు హీరో సేతుప‌తే అనే స్థాయిలో కొన్ని స‌న్నివేశాలు క‌నిపిస్తాయి.

అయితే కూలీలో మాత్రం నాగార్జున పాత్ర‌కు అంత స్కోప్ ద‌క్క‌లేద‌ని అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. విక్ర‌మ్ సినిమాలో విజ‌య్ సేతుప‌తినిఇ చంపే స‌న్నివేశంలో కూడా ఆ క్యారెక్ట‌ర్ ఆర్క్ త‌గ్గ‌లేద‌ని కానీ నాగార్జున‌ను చంపే స‌న్నివేశం అస్స‌లు బాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నాగార్జున ఇలాంటి కారెక్ట‌ర్లు చేసేముందు ఆలోచించుకోవాల‌ని కోరుతున్నారు. ఆరు సిట్టింగ్ ల త‌ర‌వాత నాగ్ ఈ క‌థ‌కు ఓకే చెప్పాడ‌ని కానీ అస‌లు చెప్ప‌కుండా ఉండాల్సింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. లోకేష్ క‌న‌క‌రాజ్ నాగార్జునతో ఇలాంటి స‌న్నివేశాలు ఎలా చేపించాడు అంటూ ఫైర్ అవుతున్నారు.

Next Story